నీ కోసం . . . మరిచి పోయిన తెలుగులో

SHE:

ఏమనుకున్నావూ, ఏదో చెత్త పోయెట్రీ రాస్తే మనమేదో మాట్లాడుకుంటామూ, దగ్గరవుతామూ అనా?
నా సంగతి నీకు తెలీదూ? అయినా నువ్వెవరు, అసలూ?

HE:

నేను నిన్ను నువ్వు అన్నప్పుడు పర్లేదు అని నువ్వన్నప్పుడు,
మొట్టమొదటి రోజు ఇంత పెద్ద కళ్ళ తో నన్ను చూసినట్టు నాకనిపించినప్పుడు,
నువ్వు, నీ శరీరమంతా ఒక హృదయమే అని నాకనిపించినప్పుడు,
ఎవరితోనూ మాట్లాడకుండా నీపని నువ్వు చేసుకుంటున్నప్పుడు,
అయినా నేనెవరూ, అసలు?
అని నన్ను నేనే ప్రశ్నించుకునేలా నన్ను చూసిన
నీ కళ్ళకు, and for such a beautiful you, థాంక్స్!

/* ]]> */